వార్డు వాలంటీర్ల ఎంపిక ,నోటిఫికేషన్ నెం. 127/జి1/2019, తేది. 24-06-2019

ప్రభుత్వము ద్వార అందించే వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను మరియు నవరత్నాలను ప్రజల చేరువకు తీసుకెళ్ళే భాద్యత నగరపాలక మరియు పురపాలక సంస్థ పై ఉన్నది. ఈ భాద్యతను సక్రమముగా నిర్వహించుట కొరకు నగరపాలక మరియు పురపాలక వార్డు వాలంటీర్లను నియమించుటకు ప్రభుత్వము నిర్ణయించింది. ప్రజలకు నగరపాలక మరియు పురపాలక సంస్థలకు మధ్య అనుసంధానకర్తలుగా పనిచేయుటకు అర్హులై ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకొనవచ్చును ఈ అనుసంధానకర్తలు వార్డు వాలంటీర్లగా పిలువబడతారు, మెరుగైన ఇతర ఉద్యోగాలు వచ్చే వరకు వార్డు వాలంటీర్లు సమాజ సేవా దృక్పధంతో పనిచేయవచ్చును.
వై.యస్.ఆర్. జిల్లలోని 09 నగరపాలక మరియు పురపాలక సంస్థల యందు సుమారు 2410 మంది వార్డు వాలంటీర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకుల నుండి 24.06.2019 నుండి 05.07.2019 వరకు ఆన్.లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించడమైనది.
 దరఖాస్తూ రుసుము లేదు
వార్డు వాలటీర్ల విధులు
వార్డు వాలంటీర్లు తమకు కేటాయించిన 100 కుటుంబాలను నగరపాలక మరియు పురపాలక సంస్థలతో అనుసందానము చేసి ప్రభుత్వ పథకాల లబ్ధిని వారి ఇంటి దగ్గరికి చేరవేయవలెను.
కుటుంబాల సమస్యలను నగరపాలక మరియు పురపాలక సంస్థల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలెను. వార్డు వాలంటీర్లు ఫలాపేక్షణ లేకుండా విధులు నిర్వహించినందులకు గాను, పని తీరు ఆధారముగా, గౌరవ వేతనము గరిష్టంగా రు. 5000/- లు నెలకు ఇవ్వబడును.
అర్హతలు:-
 దరఖాస్తుదారు డిగ్రీ పరీక్షలో ఉతీర్ణులై ఉండవలెను.
 వార్డు వాలంటీర్లుగా ఏ వార్డులో పనిచేయాలని ఆశిస్తున్నారో ఆ వార్డుకు చెందిన వారై ఉండాలి.
 30.06.2019 నాటికి 18 సంవత్సరములు నిండిన వారై 35 సంవత్సరములు దాటని వారై ఉండాలి.
 నిబంధనల ప్రకారము రిజర్వేషన్లు వర్తిస్తాయి, మహిళలకు దాదాపు 50% రిజర్వేషన్లు వర్తిస్తాయి
 క్రమశిక్షణతో మెలుగుతూ, నిజాయితిగా సేవ చేయదలచిన నిరుద్యోగ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకొనవచ్చును.
దరఖాస్తు చేసుకోను విధానము:
 ప్రతి వార్డులో ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీరు ఎంపిక చేయబడును. ఈ పనిని మునిసిపల్ స్థాయి కమిటీ నిర్వహిస్తుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులకు ఆన్.లైన్ ద్వారా ఈ http://wardvolunteer.ap.gov.in వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకొనవచ్చును.
 అధార్ నెంబరు, విద్యార్హతల ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవీకరణ పత్రము తదితర ధృవీకరణ పత్రములు ఆన్.లైన్ నందు అప్.లోడ్ చేయవలెను.
 అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికి ఈ క్రింద తెలిపిన అంశములపై మౌఖిక పరీక్షా నిర్వహించి తద్వారా వార్డు వాలంటీర్లుగా ఎంపిక చేయబడును.
1. ప్రభుత్వ పథకములు, కార్యక్రమాలు, సంక్షేమ పథకములపై అభ్యర్దుల అవగాహన.
2. సామాజిక సమస్యలు మరియు వారు నివసించే ప్రాంతములో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు.
3. NGO’s / సాంఘిక కార్యక్రమాలలో / సంస్థలలో అభ్యర్దులకు అనుభావముపై.
4. నాయకత్వపు లక్షణములు మరియు భావ వ్యక్తీకరణ నైపుణ్యముపై.
5. అభ్యర్థి వ్యక్తిత్వము మరియు సేవచేసే సామర్థ్యంపై.
క్రింద తెలిపిన కాల నియమితి ప్రకారము వార్డు వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.
వ.నెం. విషయము తేది
1 ధరఖాస్తు స్వీకరణ నోటిఫికేషన్ 24.06.2019
2 ధరఖాస్తు స్వీకరణ తేదీలు 24.06.2019 నుండి 05.07.2019 వరకు
3 ధరఖాస్తుల పరిశీలన 10.07.2019 వరకు
4 సెలక్షన్ కమిటీ ద్వార మౌఖిక పరీక్ష 11.07.2019 నుండి 25.07.2019 వరకు
5 వాలంటీర్ల ఎంపికైన వివరములు తెలుపు తేది 01.08.2019
6 శిక్షణా తరగతులు 05.08.2019 నుండి 10.08.2019
7 వాలంటీర్లు పనిచేయుట ప్రారంభించు తేది 15.08.2019
ఇతర విషయముల కోరకు సంబధిత మునిసిపల్ కార్యాలయాల యందు సంప్రదించవలెను.
ఇట్లు
సం/- సి. హరికిరణ్,
జిల్లా కలెక్టర్, వై.యస్.ఆర్. జిల్లా